సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం: సీపీ

NZB: నగరంలోని మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సాయంత్రం పర్యటించారు. వ్యాపార సముదాయాలు, మార్కెట్‌ల వల్ల ప్రజలకు ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కాలినడకన తిరుగుతూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సీపీ హామీ ఇచ్చారు.