VIDEO: సోమవరం గ్రామంలో నేల వాలిన మొక్కజొన్న
NTR: నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చే తరుణంలో పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టిన తమకు ఈ నష్టం కోలుకోలేని దెబ్బని, ఆర్థికంగా చితికిపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలన్నారు.