ముగ్గురు గంజాయి నిందితులకు జైలు శిక్ష

ముగ్గురు గంజాయి నిందితులకు  జైలు శిక్ష

AKP: గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా గురువారం తెలిపారు. చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పలరాజుపురం వద్ద 2016 అక్టోబర్ నెలలో 300 కిలోల గంజాయిని తరలించేందుకు సిద్ధంగా ఉండగా పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. చీడికాడ మండలానికి చెందిన నిందితులకు చోడవరం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.