‘MRPS జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయాలి’
HNK: జిల్లా కేంద్రంలోని హరిత కాకతీయ హోటల్లో ఇవాళ MRPS, MSP రాష్ట్ర నేత మంద కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 7న ముంబైలో నిర్వహించనున్న MRPS జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.