నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్..!
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్‌మాన్ ఘీసింగ్‌ను నియమించారు. ఆయన పేరును జన్-జెడ్ ప్రతిపాదించగా.. అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. కుల్మన్ గతంలో నేపాల్ విద్యుత్ బోర్డుకు ఎండీగా పనిచేశారు. ఆయన నియామకంపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల నేపాల్‌లో చెలరేగిన అల్లర్లు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కేపీ ఓలి సహా మంత్రులు రాజీనామా చేశారు.