'ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకోవాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకోవాలి'

JGL: సారంగాపూర్ పీహెచ్‌సీ లో డా. రాధరెడ్డి, సీహెచ్ఐ ఖుద్దుస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే మెరుగైన వైద్య సేవలను గర్భిణీలకు తెలియజేయాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా, ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించుకునేలా వారికి అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీ నమోదు ప్రక్రియను పరిశీలించారు.