ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ, మాల్యా తండా గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం MPDO శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.