బాలిక మిస్సింగ్.. కేసు నమోదు

KMR: ఎల్లారెడ్డికి చెందిన దేవావత్ నిధారాణి అదృశ్యం అయినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. సోమవారం ఎస్సై మాట్లాడుతూ.. గత నెల 28న నిధారాణి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా, ఇంట్లో వాళ్లతో ఇంటి బయట ఉన్న లైట్లను ఆఫ్ చేస్తానని చెప్పి వెళ్లి, ఇక తిరిగి రాలేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.