టీబీ బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ

టీబీ బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ

W.G: టీబీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం టీబీ వ్యాధిగ్రస్థులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు డా.కోసూరి ఆనందరాజు ఈ కిట్లను బాధితులకు అందజేశారు. టీబీ రోగులు పోషకాహారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు పాల్గొన్నారు.