భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన భర్త

భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన భర్త

SRCL: భార్యను క్రికెట్ బ్యాట్‌తో తలపై భర్త కొట్టి గాయపరిచిన ఘటన చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామంలో మంగళవారం రోజున జరిగింది. రామారావు పల్లె గ్రామానికి చెందిన సల్ల సంపత్ కుమార్ తన భార్య అయిన సల్ల లహరిని క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు. దీంతో ఆమె తలపై తీవ్ర గాయం కావడంతో చుట్టుపక్కల వాళ్ళు 108 కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు.