సత్వర పరిష్కారానికి చర్యలు: ఛైర్మన్
HNK: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. పులిగిల్ల, నర్సక్కపల్లి, ఇతర గ్రామాల్లో ఛైర్మన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు.