ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

GNTR: రాజధాని 2వ విడత ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ల్యాండ్ పూలింగ్‌పై కలెక్టరేట్‌లో మంగళవారం తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. విధివిధానాల పట్ల అధికారులు పూర్తి అవగాహన కలిగి రైతులకు వివరించాలని ఆదేశించారు. ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించిందని తదనుగుణంగా భూసేకరణ జరుగుతుందన్నారు.