దారి దోపిడీ దొంగల ముఠా గుట్టురట్టు

ప్రకాశం: చీరాల పర్చూరు ప్రాంతాల్లో వాహనాలపై వెళ్ళుతున్న వ్యక్తులను బెదిరించి నగదు, సెల్ ఫోన్లు తోపాటు ద్విచక్ర వాహనాలను దోచుకుంటూ దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల 13 వేల రూపాయల విలువ చేసే 22 సెల్ ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు ఒక ట్యాబ్, స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు.