'ప్రభుత్వ భూములు అనడం తగదు'
VZM: జిరాయితీ భూములను ప్రభుత్వ భూములంటూ బొర్రవానిపాలెం హరిజనులు రైతులను ఇబ్బంది పెట్టడం తగదని రెల్లివలస సర్పంచ్ ఇజ్రోతు ఈశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం రైతులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొర్రవానిపాలెం రెవెన్యూ పరిధిలో సుమారు 360 ఎకరాల జిరాయితీ భూములు ఉన్నాయని, వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు.