కుత్బుల్లాపూర్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యేకు వినతి
MDCL: కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, కాలనీలలో వీధి దీపాల సమస్యలు అనేకం ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇవాళ స్థానిక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. అధికారులతో సమస్యలను పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.