ఇళ్లకు రూ. 71.95 లక్షల నష్టపరిహారం: కలెక్టర్

KMR: జిల్లాలో దెబ్బతిన్న 1,574 గృహాల్లో 1,566 ఇళ్లకు నష్టపరిహారంగా రూ. 71.95 లక్షలు అందించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. చనిపోయిన 89 పశువులు, 870 కోళ్లకు నష్టపరిహారం కోసం రూ. 28.78 లక్షలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వే ద్వారా 17,700 ఎకరాల్లో పంట నష్టాన్నిగుర్తించినట్లు చెప్పారు.