108 వాహనంలోనే ప్రసవించిన మహిళ

108 వాహనంలోనే ప్రసవించిన మహిళ

NDL: అవుకు మండలం శివవరం గ్రామానికి చెందిన బాల హుస్సేనమ్మ అనే మహిళ 108 వాహనంలోనే ప్రసవించింది. శివవరం గ్రామం నుంచి ప్రసవం కోసం 108 వాహనంలో బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. మహిళ ముందే గుండె ఆపరేషన్ చేయించుకుంది. రిస్కు ఎందుకని డాక్టర్లు నంద్యాలకు మహిళను రెఫర్ చేశారు. 108 వాహనంలో నంద్యాలకు తరలిస్తుండగా మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది.