కరెంట్ షాక్‌తో మహిళ మృతి
KMM: కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన పానెం సరస్వతి (50) బట్టలు ఉతికి అరేస్తోంది. ఈ క్రమంలో ఐరన్ దండానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్కు గురైంది. దీంతో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లికి తరలించారు.