భగీరథ మహర్షికి నివాళులర్పించిన మంత్రి బీసీ

NDL: భగీరథ మహర్షి జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం సంతోషకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో భగీరథ మహర్షి విగ్రహానికి సగర కులస్తులతో కలిసి నివాళులర్పించారు. గంగను భువికి తెచ్చిన మహర్షిని పూజించడం అందరి కర్తవ్యమని మంత్రి పేర్కొన్నారు.