ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: ప్రజాదర్బారు కార్యక్రమంతో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ రెడ్డిగూడెం మండల పరిషత్తు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనమన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు.