సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్

ELR: ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఉంగుటూరు నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, సీఎం పాల్గొనే సభ ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.