ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ

ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకీ మరింత దిగజారుతుంది. ప్రస్తుతం ఆల్ టైన్ కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభం ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.50కు చేరింది. ఇంట్రాడేలో 92.57ను తాకింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.