అనంతపురంలో బీజేపీ నాయకుల సంబరాలు
ATP: బీహార్ ఎన్నికల్లో ప్రజల అద్భుత తీర్పు 'మూడ్ ఆఫ్ ది నేషన్'కు ప్రతిబింబమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంపై పెరుగుతున్న ప్రజాదరణకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. బీహార్ ఎన్నికల్లో గెలుపుతో అనంతపురంలో సంబరాలు నిర్వహించారు. నాయకులు స్వీట్లను తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు.