పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: కలిగిరి మండలం పరికోట గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి MLA కాకర్ల సురేష్ పాల్గొన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను MLA అందజేశారు. గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో అనేక అవకతవకులు జరిగాయని అటువంటి తప్పిదాలు జరగకుండా CM చంద్రబాబు పారదర్శకంగా పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.