ఏజ్ కేర్ ఫౌండేషన్‌కు పరికరాలు అందజేత
విశాఖలోని ఆనందపురంలో ఓ ఫౌండేషన్‌కు రోటరీ క్లబ్ రూ.1.13 కోట్ల విలువైన వైద్య పరికరాలు ఆదివారం అందజేసింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని, వృద్ధులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఆధునిక పరికరాలతో చికిత్స అందించడం రోగులకు ఉపయోగకరమన్నారు. ఫిజియోథెరపీ, ల్యాబ్, నర్స్ కాలింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.