బీసీల మహా ధర్నాకు తరలిన నాయకులు

KMM: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలో నిర్వహించబోయే మహా ధర్నాకు తిరుమలయపాలెం మండల బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక వాహనాలలో తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని నాయకులు అన్నారు.