పెండింగ్ జీతాలు చెల్లించాలని మంత్రికి విన్నపం
WGL: కేంద్రంలోని కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థుల హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించేలా చూడాలని కోరుతూ మంత్రి కొండ సురేఖకు సీఐటీయూ ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. 8 నెలలుగా హాస్టల్ వర్కర్స్‌కు జీతాలు రావడంలేదని మంత్రికి రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ విన్నవించారు