వివాహాలకు ఈ ఆలయం పెట్టింది పేరు

వివాహాలకు ఈ ఆలయం పెట్టింది పేరు

JN: చిల్పూర్‌ మండలంలోని చిల్పూర్‌గుట్ట శ్రీబుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా వివాహాలకు పెట్టింది పేరు. ఉమ్మడి జిల్లాలోనే ఇక్కడ అత్యధికంగా వివాహాలు జరుగుతుంటాయి. నెలకు సగటున 50-60 వరకు వివాహాలు నమోదవుతుండగా, శుభ ముహూర్తాల రోజు 20 నుంచి 25 వరకు వివాహాలు జరుగుతుంటాయి. వరంగల్‌ జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకుంటారు.