ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
RR: షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయదశమి వరకు టీచర్స్ కాలనీలోని అన్ని రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.