ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు

ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు

MLG: జిల్లాలో రేపు జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు వెళ్లిన సిబ్బంది కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తుందని వరంగల్-2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. ములుగు బస్టాండ్ నుంచి హన్మకొండ వరకు బుధవారం రాత్రి 10:00, 12:00 గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు మూడు ట్రిప్లు నడుపుతున్నామని అన్నారు. ఈ సౌకర్యాన్ని ఎన్నికల నిర్వహణకు వెళ్లిన సిబ్బంది ఉపయోగించుకోవాలన్నారు.