నేడు రాయచోటిలో పర్యటించనున్న మంత్రి
అన్నమయ్య: రాయచోటిలో జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా మాండవ్య నది పరివాహక ప్రాంతాన్ని బుధవారం ఉదయం 9:00 గంటలకు మంత్రి మండిపల్లి పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హాజరవనున్నారు. అనంతరం గాలివీడు రోడ్డులోని నది పరిసరాలను సందర్శించి, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.