'ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి'
SKLM: శ్రీ ముఖ లింగంలో ఈనెల 15, 16, 17, 18వ తేదీల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ ఛైర్మన్ శివ ప్రసాద్ పాడి అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ ఉత్సవ ప్రత్యేక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆలయ ప్రాంతాల అభివృద్ధి భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు, సర్పంచ్, స్థానికులు పాల్గొన్నారు.