'ముదిరాజులను బీసీ ఏ గ్రూప్ లోకి మార్చాలి'
MNCL: రాష్ట్రంలో ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏ గ్రూప్‌లోకి మార్చాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ వేడుకల్లో వారు మాట్లాడారు. ముదిరాజ్‌ల అభ్యున్నతికి మహాసభ కృషి చేస్తోందని తెలిపారు.