VIDEO: ముందుగానే కేబుల్స్‌ను సరి చేయండి: కార్పొరేటర్

RR: సరూర్ నగర్ డివిజన్‌లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి TGSCDPLసరూర్ నగర్ AE నావేద్‌తో కలిసి పర్యటించారు. రానున్న నవరాత్రుల సందర్భంగా.. అమ్మవారి మండపాల వద్ద ఎలక్ట్రిక్ సిటీ వైర్లు ఊగుతూ ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా కేబుల్స్‌ను సరి చేయించాలని తెలిపారు. డివిజన్‌లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందుగానే స్పందించి సురక్షితమైన వాతావరణం కల్పించాలన్నారు.