సి. కొత్తపల్లిలో తాగునీటి బోరు ఏర్పాటు

ప్రకాశం: పుల్లలచెరువు మండలంలోని సి. కొత్తపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి బుధవారం గ్రామంలో బోర్ వేసేందుకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ బోరింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.