'కుటుంబాన్నికి అండగా ఉంటా ధైర్యంగా ఉండండి '
NLR: విడవలూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాతూరు శ్రీనివాసులు మృతి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని తెలిపారు.