'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'
ATP: గుంతకల్లులో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి పరిష్కరిస్తామని తెలిపారు.