నిండు కుండను తలపిస్తున్న జంట జలాశయాలు
హైదరాబాద్ నగర జంట జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఉస్మాన్‌సాగర్‌లో నీటి మట్టం 1789.850 అడుగులు, హిమాయత్‌సాగర్‌లో 1963.500 అడుగులకు చేరింది. రెండు జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టంతో మెరుస్తుండగా, నగరానికి తాగునీటి సరఫరా నిరంతరంగా సాగుతోంది. అధికారులు జలాశయాల గేట్ల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.