'మానవాళికి దిక్సూచి శ్రీకృష్ణుడి భగవద్గీతా జ్ఞానం'

SRPT: మాయా ప్రపంచంలో చిక్కుకున్న మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతా జ్ఞానం దిక్సూచి అని త్రైత సిద్ధాంతం, ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం ఆవరణలో శనివారం సాయంత్రం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.