VIDEO: కారు–లారీ ఢీ

VIDEO: కారు–లారీ ఢీ

ASR: అనంతగిరి మండలం కాశీపట్నం రైతు భరోసా కేంద్రం సమీపంలోని మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, అరకు నుంచి ఎస్‌.కోట వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఇసుక లారీతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.