'అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధించినా కఠిన చర్యలు'
SS: జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నేరస్తులు, రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం ఆయన చేశారు.