తిరంగా యాత్రలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే

TPT: గూడూరు నియోజకవర్గంలోని వాకాడు గ్రామంలో శుక్రవారం ఆపరేషన్ సింధూరులో భాగంగా నిర్వహించిన తిరంగా యాత్ర కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. మొదట అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు. స్తానిక నాయకులు, కార్యకర్తలు అందరూ జాతీయ జెండాలు చేత పట్టుకొని 'వందేమాతరం.... భారత మాతాకీ జై' అను నినాదాలతో మార్మోగిపోయింది.