అజిత్ దోవల్‌తో చైనా విదేశాంగమంత్రి భేటీ

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, భద్రతా సహకారం, సరిహద్దు వివాదాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.