అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

NLR: మొంథా తుఫాన్ నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని 5 మండలాలలో అధిక వర్షపాతం నమోదు కానున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలలో ఉండేలా చూడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.