CMO, లోక్‌భవన్‌కు బాంబు బెదిరింపులు!
TG: తెలంగాణ CMO, గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఖాన్ పేరిట గవర్నర్ కార్యాలయానికి వచ్చిన మెయిల్‌లో CMO, లోక్‌భవన్‌ను వెంటనే ఖాళీ చేయించాలని ఉంది. ఈ మేరకు 3న పంజాగుట్ట పోలీసులకు గవర్నర్ ఆఫీస్ ఫిర్యాదు చేయగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.