జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కేటీఆర్ నివేదిక
TG: BRS హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మాజీమంత్రి కేటీఆర్ ప్రగతి నివేదిక సమర్పించారు. 'పదేళ్లలో జూబ్లీహిల్స్ రోడ్ల కోసం రూ.2,463 కోట్లు ఖర్చు చేశాం. SRDP కింద కీలకమైన ప్లై ఓవర్స్ పూర్తి చేశాం. పదేళ్లలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం' అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.