APJF జిల్లా నూతన కమిటీ ఎన్నిక
GNTR: గుంటూరులోని ఏపీ NGOS హాల్‌లో ఆంధ్రా జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) గుంటూరు జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రంగారావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయులకు అక్రిడిటేషన్, ఆరోగ్య బీమా,ఇంటి స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు శివరాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.