పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సిలింగ్

కృష్ణా: నందివాడ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం SI కే.శ్రీనివాసు ఆధ్వర్యంలో సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్, కేడి షీట్, డీసీ షీట్ కలిగిన హిస్టరీ షీట్ హోల్డర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో సత్ప్రవర్తనతో ఉండాలని సూచిస్తూ, వారిపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.