నేడు ఘంటసాల సంగీత గానామృత లహరి

ELR: ఏలూరు (ఆర్ఆర్ పేట)నగరానికి చెందిన ఘంటసాల సంగీత కళాశాల ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతి సందర్భంగా ఘంటసాల గానా మృత లహరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక వైఎంహెచ్ఎ హాలులో సాయంత్రం 5:30 గంటలకు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు వి.రామ్ కుమార్, ఎండీ ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు గాయకులు ఘంటసాల గీతాలు ఆలపిస్తారని పేర్కొన్నారు.