ఇప్పటికైనా జగన్ అసెంబ్లీకి రావాలి: యనమల
AP: విద్యార్థుల మాక్ అసెంబ్లీ చూసైనా జగన్ ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని TDP సీనియర్ నేత యమమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో విద్యార్థులు చక్కగా చూపించారని గుర్తుచేశారు. జగన్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని పిలుపునిచ్చారు. ఎక్కడో మాట్లాడటం కంటే, అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా చర్చించడం ముఖ్యమని సూచించారు.